Jagan: కోవిడ్ -19 నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

AP CM Jagan review on coronoa virus
  • తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష
  • సమీక్షలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి, సీఎస్‌ సహా అధికారులు
  • రాష్ట్రంలో కొత్తగా 35 పాటిజివ్ కేసుల నమోదు
ఏపీలో కోవిడ్ -19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 757కు చేరింది.
Jagan
YSRCP
Andhra Pradesh
COVID-19

More Telugu News