Narendra modi: మాల్దీవులకు అండగా ఉంటాం: మోదీ

India will stand by its close maritime neighbour says Narendra modi
  • ఆ దేశ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని
  • కరోనా ప్రభావం, ఆరోగ్య, ఆర్థిక సమస్యలపై చర్చ
  • వైరస్‌పై కలిసి పోరాడదామన్న మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమద్ సొలీతో ఫోన్లో మాట్లాడారు. మాల్దీవుల్లో కరోనా మహమ్మారి ప్రభావం, దాని కారణంగా దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యల గురించి చర్చించారు.  ఈ కష్టకాలంలో  తమ పొరుగు దేశానికి భారత్ సహకారం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.

భారత్, మాల్దీవుల మధ్య ప్రత్యేక బంధం ఉందని మోదీ అన్నారు. అది తమ ఉమ్మడి శత్రువు అయిన కరోనాపై  కలిసి పోరాడాలనే  ఇరు దేశాల సంకల్పానికి బలం చేకూరుస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు మోదీ వరుస ట్వీట్స్ చేశారు.
Narendra modi
Maldives President
Spoke on phone

More Telugu News