retaired employees: ఏపీలో విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌లో కోతపై హైకోర్టులో పిటిషన్‌.. విచారణ!

Pension deduction pitition hered by high court today
  • న్యాయవాది జంధ్యాల రవిశంకర్ దాఖలు
  • తొలికేసుగా కోర్టులో ఈ రోజు విచారణ
  • మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లోని విశ్రాంత ఉద్యోగుల  పింఛన్‌లో యాభై శాతం కోత విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం తొలి కేసుగా ఈరోజు విచారించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్‌లో యాభై శాతం కోత విధించి, పరిస్థితి చక్కబడిన తర్వాత చెల్లిస్తానని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

అయితే పెన్షనర్లకు అదే ఆధారమని, వారి పింఛన్‌లో కోత అన్యాయమంటూ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఈరోజు విచారించిన కోర్టు మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజు వాదనలు వింటామని స్పష్టం చేసింది.
retaired employees
pensions
AP High Court

More Telugu News