పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నాను.. ఆయనను కలిశాను.. కానీ కుదరలేదు: రాజమౌళి
- ఆయన దృక్పథం అంతా వేరేలా ఉంది
- ప్రజాసేవ వంటి వాటిపై ఉంది
- సినిమాలకు సమయం తక్కువగా కేటాయించే అవకాశం
- నేనేమో రోజుల కొద్దీ సినిమాలు తీస్తుంటాను
'పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నాను.. ఈ విషయంలో ఆయనను గతంలో కలిశాను.. కానీ, కుదరలేదు. ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆయన దృక్పథం అంతా వేరేలా ఉంది. ప్రజాసేవ వంటి వాటిపై ఉంది. సినిమాలకు సమయం తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది' అని చెప్పారు.
'మరోవైపు, నేనేమో రోజుల కొద్దీ సినిమాలు (ఆలస్యంగా) తీస్తుంటాను. పవన్‌తో సినిమా తీసే అవకాశం లేదు. సమాజం పట్ల బాధ్యత కానీ, సమాజానికి ఏదైనా చేయాలన్న కసిగానీ పవన్ కల్యాణ్‌లో 100 శాతం ఉంటే.. నాలో మాత్రం 0.5 ఉంటుంది. ఆయన దృక్పథాన్ని నా దృక్పథంతో పోల్చి చూడొద్దు. పవన్ కల్యాణ్ సినిమా రంగంలో ఉన్న మంచి భవిష్యత్తు నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు' అని రాజమౌళి వ్యాఖ్యానించారు.