Anushka Shetty: అనుష్క తీరుపై 'నిశ్శబ్దం' నిర్మాతల అసహనం?

Nishabdham Movie
  • షూటింగు పూర్తిచేసుకున్న 'నిశ్శబ్దం'
  • లాక్ డౌన్ కారణంగా విడుదల ఆలస్యం
  • అమెజాన్ నుంచి భారీ ఆఫర్
అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం' సినిమా రూపొందింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కోన వెంకట్ - విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా థియేటర్స్ కి రాలేకపోయింది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత థియేటర్స్ కి జనాలు ఎంతవరకూ వస్తారనేది ప్రశ్నార్థకమే. అందువలన కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను అమెజాన్ కి ఇచ్చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'నిశ్శబ్దం' సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. సినిమా పూర్తయిపోయి నెలకి 50 లక్షలు వడ్డీలు కట్టుకుంటున్న నిర్మాతలు, అమెజాన్ కి ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అమెజాన్ కి ఇవ్వాలంటే అందుకు అనుష్క అనుమతి కూడా కావాలి. అయితే, ఆమె మాత్రం అంగీకరించడం లేదట. దాంతో వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న నిర్మాతలు, ఆమె ధోరణి పట్ల అసహనంతో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Anushka Shetty
Hemanth Madhukar
Nishabdham Movie

More Telugu News