Hyderabad: వాహనాలకు ఇచ్చిన అనుమతులపై పునఃపరిశీలన: హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌

vehicle permissions will be reviewed says hyderabad CP
  • వేర్వేరు కారణాలతో కొన్ని వాహనాలు తిరిగేందుకు అనుమతి
  • రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగింపుతో తాజా నిర్ణయం
  • అనుమతి ఉన్న వారు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర, తప్పనిసరి కారణాలతో రోడ్లపై తిరిగేందుకు కొన్ని వాహనాలకు ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించనున్నట్లు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ కాలాన్ని వచ్చేనెల ఏడో తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

తెలంగాణలో ఈరోజు నుంచి లాక్‌డౌన్‌ను కొన్ని పరిమితులతో ఎత్తివేస్తారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే నిన్న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సుదీర్ఘ సమావేశంలో లాక్‌డౌన్‌ గడువు పొడిగించడమే కాకుండా మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో సీపీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అనుమతి ఉన్న వాహన చోదకులు కూడా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా విస్తరణ కట్టడికి పోలీసుల పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Hyderabad
commissioner of police
vehicle permission

More Telugu News