ఊపిరి పీల్చుకుంటున్న స్పెయిన్.. తగ్గుతున్న కరోనా మరణాలు
- గత 24 గంటల్లో 410 మంది మృతి
- 20 వేలకు చేరిన మృతుల సంఖ్య
- అత్యవసర స్థితి మరో రెండు వారాల పొడిగింపు
కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో విధించిన అత్యవసర స్థితిని మరో రెండువారాలపాటు పొడిగిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు. కరోనా కట్టడి విషయంలో తాము సరైన దారిలోనే వెళ్తున్నట్టు ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయని ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి ఫెర్నాండో సైమన్ పేర్కొన్నారు. మరోవైపు, అత్యవసర పరిస్థితి పొడిగించినప్పటికీ, ఈ నెల 27 నుంచి పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.