ఇల్లే ఆఫీసు, ఇంటర్నెట్టే మీటింగ్ రూమ్... కరోనా ఎలా మార్చేసిందో చూడండి: మోదీ
- లాక్ డౌన్ లో ఇళ్లకే పరిమితమైన ప్రజానీకం
- ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఒడిదుడుకులతో ప్రారంభమైందని వెల్లడి
- లింక్డిన్ లో మోదీ పోస్టు
"ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఒడిదుడుకులతో ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా ప్రొఫెషనల్ లైఫ్ ఎంతో మార్పులకు లోనైంది. సహోద్యోగులతో ఆఫీసు బ్రేక్ లో పిచ్చాపాటీలు గత చరిత్రలో కలిసిపోయాయి. నేను కూడా ఈ మార్పులకు అతీతుడ్నేమీ కాను. క్యాబినెట్ సహచరులు, ఉన్నతాధికారులతో మాట్లాడాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నాను" అని వెల్లడించారు. ఈ మేరకు లింక్డిన్ సైట్ లో పోస్టు చేసి ఆ లింకును ట్విట్టర్ లో పంచుకున్నారు.