Toll rates: నేటి అర్థరాత్రి నుంచి పెంచిన టోల్ రేట్లు అమలు

Implemented toll rates from todays midnight
  • లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై రూ.5 
  •  బస్సు, ట్రక్ లకు రూ.10
  • భారీ వాహనాలకు రూ.20 చొప్పున పెంపు 

నేటి అర్ధరాత్రి నుంచి పెంచిన టోల్ గేట్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ హై వే అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) అధికారి విద్యాసాగర్ తెలిపారు. లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై రూ.5, బస్సు, ట్రక్ లకు రూ.10, భారీ వాహనాలకు రూ.20 చొప్పున టోల్ ఛార్జీలు పెంచినట్టు తెలిపారు.

ప్రతి ఏడాది ఏప్రిల్ 1నే టోల్ ఛార్జీలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ‘కరోనా’ కారణంగా ఈ ఏడాది టోల్ ఛార్జీల పెంపులో జాప్యం జరిగిందని నేషనల్ హై వే అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) అధికారి విద్యాసాగర్ తెలిపారు. లాక్ డౌన్ లో భాగంగా రేపటి నుంచి కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలను అనుమతిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News