‘పాక్’లో ఓ హత్య కేసులో నిందితుడి ఫొటోకు బదులు బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ ఫొటో!
- పాకిస్థాన్ కు చెందిన పార్టీ ఎంక్యూఎం నేత ఆమీర్ ఖాన్
- ఓ హత్య కేసులో నిందితుడు..17 తర్వాత వెలువడ్డ తీర్పు
- ఆమీర్ ఖాన్ ను నిర్దోషిగా ప్రకటించిన న్యాయస్థానం
- ఈ వార్త ప్రసారం సయమంలో ఆ ఆమీర్ కు బదులు ఈ అమీర్ ఫొటో
ఈ కేసుకు సంబంధించిన తీర్పు పదిహేడేళ్ల తర్వాత వెలువడింది. ఈ కేసులో ఆమీర్ ఖాన్ ని నిర్దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు ప్రకటించింది. ఈ వార్తను ప్రసారం చేసే సమయంలో సదరు ఛానెల్ ఎంక్యూఎం నేత ఆమీర్ ఖాన్ ఫొటోకు బదులుగా బాలీవుడ్ హీరో ఫొటోను ఉంచింది.ఈ ఛానెల్ చేసిన నిర్వాకంపై కొందరు నెటిజన్లు మండిపడగా, మరికొందరు సెటైర్లు విసిరారు.