Vijayasai Reddy: చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలన్న ఎంపీ విజయసాయిరెడ్డి

Vijayasaireddy criticises chandrababu
  • చంద్రబాబు ఇంకా తానే సీఎం అనుకుంటున్నారు
  • వీడియో కాన్ఫరెన్స్ లతో సమయాన్ని వృథా చేస్తున్నారు
  • చంద్రబాబు మాదిరే కన్నా కూడా ఆరోపణలు  
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇంకా తానే ఏపీ సీఎం అనుకుంటున్నారని, వీడియో కాన్ఫరెన్స్ లతో సమయాన్ని వృథా చేస్తున్నారని సెటైర్లు విసిరారు.

ఏపీ శాసనమండలి రద్దు కాబోతోందన్న ఆవేదనతో బాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించిన విజయసాయిరెడ్డి, రేపు చంద్రబాబు పుట్టినరోజు అని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా విరుచుకుపడ్డారు. చంద్రబాబు మాదిరే కన్నా కూడా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రూ.20 కోట్లకు కన్నా అమ్ముడుపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News