అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 850 కి.మీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన యువకుడు.. చివరకు కథ అడ్డం తిరిగింది!
- ఉత్తరప్రదేశ్‌లో ఘటన
- పంజాబ్ నుంచి యూపీకి వెళ్లిన యువకుడు
- క్వారంటైన్‌కు తరలించిన పోలీసులు
అయితే ఇంటికి మరో 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంది. సొంత జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో సరిహద్దులో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అతడి నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అతడిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
అతడికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని, నెగిటివ్ అని తేలితే 14 రోజుల పర్యవేక్షణ అనంతరం ఇంటికి పంపుతామని స్పష్టం చేశారు. తాను పెళ్లి చేసుకుంటానని అతడు ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులు అతడిని వదల్లేదు.