Nimmakayala Chinarajappa: చంద్రబాబు బయటకు వస్తే వైసీపీ నేతలు భయపడతారు: చినరాజప్ప

chinarajappa on ycp leaders
  • చంద్రబాబు నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నారు 
  • కొవిడ్‌-19పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు
  • సీఎం జగన్ మీడియా ముందుకు కూడా రావట్లేదు
  • ప్రజలు పడుతోన్న ఇబ్బందులను జగన్ పట్టించుకోవట్లేదు

కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉంటున్నారని, ఆయన బయటకు రావట్లేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... చంద్రబాబు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ తన నివాసంలోనే ఉండి కొవిడ్‌-19పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.

ఆయన బయటకు వస్తే వైసీపీ నేతలు భయపడతారని చినరాజప్ప చెప్పుకొచ్చారు. సీఎం జగన్ సమీక్షలు చేస్తున్నారని, అయితే, ఆయన మీడియా ముందుకు కూడా రావట్లేదని విమర్శించారు. ముందు ఏపీ సీఎం జగన్‌ బయటకు వచ్చి తిరగాలని అన్నారు. జగన్ ఆ పని చేస్తేనే రాష్ట్రంలో కొవిడ్‌-19 ఎంతగా విజృంభిస్తుందో ఆయనకు తెలుస్తుందని చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు పడుతోన్న ఇబ్బందులను జగన్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News