Andhra Pradesh: ముందుగా కొన్న టికెట్ల డబ్బును రిటర్న్ ఇచ్చేస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ!

APSRTC Started Refunds of Advance Booking
  • 16 నుంచి ప్రయాణాలకు వేలాది టికెట్ల బుక్
  • మే 3 వరకూ బస్సులు నడపలేని పరిస్థితి
  • రిఫండ్స్ ప్రారంభించిన అధికారులు
లాక్ డౌన్ ను 16వ తేదీ నుంచి తొలగిస్తారన్న ఆలోచనతో, ఈ నెల తొలి వారంలో జారీ చేసిన అడ్వాన్స్ టికెట్లకు సంబంధించిన రుసుమును ప్రయాణికులకు రిఫండ్ చేయడం ప్రారంభించామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. 16 నుంచి ప్రయాణాలకు అనుమతిస్తారన్న ఉద్దేశంతో ఏటీబీ ఏజంట్ల ద్వారా, ఆర్టీసీ బస్టాండ్లలోని రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా, ఆన్ లైన్ విధానంలో వేలాది మంది టికెట్లను బుక్ చేసుకున్నారు.

అయితే, లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో బస్సులన్నింటినీ రద్దు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆన్ లైన్ లో టికెట్లు పొందిన వారి ఖాతాల్లోకి నేరుగా ఆ రిఫండ్ డబ్బును జమ చేస్తున్నామని, ఆర్టీసీ బస్టాండ్లలో, ఏజంట్ల నుంచి పొందిన టికెట్లను ప్రయాణికులు స్వయంగా రద్దు చేసుకుని పూర్తి నగదును వాపసు పొందవచ్చని వెల్లడించారు. 
Andhra Pradesh
APSRTC
Refunds
Lockdown

More Telugu News