Corona Virus: దేశంలో సింగిల్ డిజిట్ కరోనా కేసులున్న రాష్ట్రాలు ఇవే!

Some states in India gets only single digit corona cases
  • దేశంలో ఆశ్చర్యకర పరిస్థితి
  • ఆరు రాష్ట్రాల్లో 1000కి పైగా కేసులు
  • మరికొన్ని రాష్ట్రాల్లో రెండంకెలు కూడా దాటని బాధితుల సంఖ్య
భారత్ లో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో 1000కి పైగా కరోనా కేసులు నమోదు కాగా,  మరికొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రెండంకెలు కూడా దాటకపోవడం ఆశ్చర్యం కలిగించే పరిణామం. నాగాలాండ్ జీరో స్టేజ్ లో ఉంది. ఇక్కడ ఒక కేసు నమోదు కాగా, బాధితుడ్ని అసోం తరలించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో ఇప్పటివరకు నమోదైన కేసులు ఒక్కొక్కటి మాత్రమే. త్రిపురలో 2, మణిపూర్ లో 2, పుదుచ్చేరిలో 7, గోవాలో 7 కేసులు నమోదయ్యాయి.

ఇక, ఆరు రాష్ట్రాల్లో 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో సగం కేసులు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నాయి. మహారాష్ట్రలో 3,323 కేసులు, ఢిల్లీలో 1,707, మధ్యప్రదేశ్ లో 1,355, తమిళనాడులో 1,323, రాజస్థాన్ లో 1,229, గుజరాత్ లో 1,272 కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు రాష్ట్రాల్లో మరణాలు కూడా భారీగానే ఉన్నాయి. కరోనాతో ఒక్క మహారాష్ట్రలోనే 201 మంది ప్రాణాలు విడిచారు. మధ్యప్రదేశ్ లో 69, ఢిల్లీలో 42, గుజరాత్ లో 48 మరణాలు సంభవించాయి.
Corona Virus
States
India
Single Digit
Arunachal Pradesh
Maharashtra

More Telugu News