Venkaiah Naidu: ఏపీ ప్రభుత్వ కరోనా నివారణ చర్యలను ప్రశంసించిన వెంకయ్యనాయుడు

Vice President Venkaiah Naidu appreciates AP government
  • కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల దిగుమతి
  • రోజూ 10 వేల మందికి పరీక్షలు నిర్వహించవచ్చన్న వెంకయ్య
  • కరోనా పరీక్షలు వేగవంతం అవుతాయని ఆశాభావం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల పట్ల స్పందించారు. ఏపీలో కరోనా నివారణ చర్యలు జరుగుతున్న తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకోవడం శుభపరిణామం అని అభినందించారు. కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను ఇచ్చే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో రోజుకు 10 వేల మందికి పరీక్షలు నిర్వహించవచ్చని, ఇది మంచి నిర్ణయం అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరిగేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Venkaiah Naidu
Andhra Pradesh
Rapid Testing Kits
South Korea
Corona Virus

More Telugu News