Gandhi Hospital: ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులపై దాడి.. 15 రోజుల వ్యవధిలో మూడోసారి!

  • గంజాయి మత్తులో వైద్యుడిని దూషించిన వ్యక్తి
  • అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందిపైనా దాడి
  • ఎస్పీఎఫ్ పోలీసుల భద్రత ఉన్నా ఆగని దాడులు
Osmania Doctor attacked by patient

 హైదరాబాదులోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో వైద్యులపై దాడులు కొనసాగుతున్నాయి. కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులకు సాయమందించాల్సింది పోయి దాడులకు పాల్పడుతుండడంతో వైద్యులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎవరొచ్చి దాడిచేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.

ఈ క్రమంలో నిన్న గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఉస్మానియా వైద్యుడిని ఇష్టానుసారం దూషిస్తూ దాడి చేయబోయాడు. అడ్డుకోబోయిన భద్రతాధికారిపై దాడికి పాల్పడ్డాడు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులలో వైద్యులపై దాడి జరగడం గత 15 రోజుల వ్యవధిలో ఇది మూడోది. వైద్యులకు రక్షణ కల్పించేందుకు ఉస్మానియాలో ఎస్పీఎఫ్ పోలీసుల భద్రత ఉన్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. నిన్న క్యాజువాలిటీలో వైద్యుడిపై దాడి జరిగినప్పుడు ఎస్పీఎఫ్ సిబ్బంది విధుల్లో లేరని డ్యూటీ ఆర్ఎంవో డాక్టర్ రాజ్‌కుమార్ ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News