America: అమెరికాలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 4,591 మంది మృతి!

America covid death toll raised to 35 thousand and three dead in every minute
  • నిమిషానికి ముగ్గురి చొప్పున మృతి
  • గంటకు సగటున 191 మంది మృత్యువాత
  • దేశంలో 35 వేలు దాటిన మరణాలు
కరోనా మహమ్మారి బారినపడిన అగ్రరాజ్యం అమెరికాలో మరణ మృదంగం మోగుతోంది. విలయతాండవం చేస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ అక్కడ నిమిషానికి ముగ్గురి చొప్పున ప్రాణాలను బలితీసుకుంటోంది. గత 24 గంట్లలో ఏకంగా 4,591 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.  

మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల మధ్య సగటున గంటకు 107 మంది చనిపోగా, ఇప్పుడా సంఖ్య 191కి చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 35 వేలు దాటిపోయింది. ఎపిసెంటర్‌గా మారిన న్యూయార్క్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 16 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 7 లక్షల కేసులు నమోదయ్యాయి.
America
COVID-19
covid deaths
New York

More Telugu News