ఏపీ కరోనా నివారణ చర్యలను ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్రం!
- ఏపీలో నివారణ చర్యలపై మై గవ్ పోర్టల్ ట్వీట్
- ఇంటింటా సర్వే చేస్తున్నారని వెల్లడి
- 16 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తున్నారంటూ వివరణ
ఏపీ సర్కారు కొవిడ్-19 వైరస్ మరింత వ్యాపించకుండా 16 కోట్ల మాస్కులను ప్రజలందరికీ పంపిణీ చేస్తోందని, రాష్ట్రంలో మూడో విడత ఇంటింటి సర్వే కొనసాగుతోందని వెల్లడించింది. కొవిడ్ కేసులను గుర్తించే క్రమంలో 1.47 కోట్ల గృహాల్లో 1.43 గృహాల్లో సర్వే చేశారని తెలిపింది. ఈ సర్వే ద్వారా 32,349 కేసులను వైద్యాధికారులకు సిఫారసు చేశారని, వాటిలో 9,107 మందికి పరీక్షలు నిర్వహించాలని సూచించారని పేర్కొంది.