Shoib Akhtar: దాల్మియా లేకపోతే షోయబ్ అఖ్తర్ కెరీర్ ఖేల్ ఖతం అయ్యేది: పీసీబీ మాజీ ఛైర్మన్

Shoaib Akhtars Career Would Have Ended Early If Not For Jagmohan Dalmiyas Support Says Former PCB Chief
  • అఖ్తర్ బౌలింగ్ పై నిఘా ఉంచినట్టు ఐసీసీ తెలిపింది
  • అప్పుడు దాల్మియా ఐసీసీ ఛైర్మన్ గా ఉన్నారు
  • అప్పుడు పాక్ కు దాల్మియా మద్దతుగా నిలిచారు
ఐసీసీ, బీసీసీఐ మాజీ చీఫ్ జగ్మోహన్ దాల్మియా సాయం చేయకపోతే పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ కెరీర్ 2000-01లోనే ముగిసిపోయేదని పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ తౌకీర్ జియా అన్నారు. అఖ్తర్ బౌలింగ్ యాక్షన్ పై నిఘా ఉంచామని 1999లో పీసీబీకి ఐసీసీ తెలిపిందని చెప్పారు. అప్పుడు దాల్మియా ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని... అఖ్తర్ బౌలింగ్ యాక్షన్ కేసులో తమకు ఆయన ఎంతో సహకరించారని తెలిపారు.

అఖ్తర్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఐసీసీ సభ్యులు చెపుతున్నా... పాక్ కు మద్దతుగా దాల్మియా నిలిచారని చెప్పారు. దాల్మియా పలుకుబడి వల్ల.. పుట్టుకతోనే అఖ్తర్ కు శారీరక లోపం ఉందని, అందువల్లే బౌలింగ్ యాక్షన్ లో తేడా ఉందనే విషయాన్ని ఐసీసీ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. దీంతో, అఖ్తర్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోకుండా, కొనసాగిందని చెప్పారు.
Shoib Akhtar
Dalmia
ICC
PCB

More Telugu News