Andhra Pradesh: ఏపీలో ఏడాది ఒప్పంద పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP Government going to appointment contract doctors
  • 1,184 వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం
  • ప్రభుత్వ జనరల్, జిల్లా ఆస్పత్రుల్లో నియామకానికి ప్రకటన
  • ఈ నెల 19లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచన
ఏపీలో ఏడాది ఒప్పంద పద్ధతిలో 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వ జనరల్, జిల్లా ఆస్పత్రుల్లో వైద్యులు, స్పెషలిస్టు డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల నియామకం నిమిత్తం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. 592 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 192 అనస్తటిస్టులు, 400 జనరల్, పల్మనరీ మెడిసిన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెల 19లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Andhra Pradesh
conctract doctors
Corona Virus
Notification

More Telugu News