Chiranjeevi: 'ఆచార్య'లో మహేశ్ పేరు అలా తెరపైకి వచ్చింది: దర్శకుడు కొరటాల

Acharya Movie
  • చరణ్ పచ్చజెండా ఊపాడు
  •  డేట్స్ విషయంలో టెన్షన్ పడ్డాను
  •  మహేశ్ బాబు అలా అనడం విశేషమన్న కొరటాల
అపజయమెరుగని దర్శకుడిగా కొరటాల తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను మహేశ్ బాబు చేయనున్నట్టు ఇటీవల ఒక వార్త షికారు చేసింది. ఆ వార్త ఎలా పుట్టుకొచ్చిందనే విషయాన్ని గురించి కొరటాల ఇలా చెప్పుకొచ్చారు.

'ఆచార్య'లో బాధ్యత కలిగిన ఒక యువకుడి పాత్ర కోసం చరణ్ ను అనుకుంటున్నట్టుగా చిరంజీవితో చెబితే ఆయన ఓకే అన్నారు. తన పాత్ర గురించి చెబితే చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' ప్లానింగ్ లో మార్పు కారణంగా, చరణ్ డేట్స్ విషయంలో నాకు టెన్షన్ మొదలైంది. అదే విషయాన్ని మాటల సందర్భంలో నేను మహేశ్ బాబుతో అంటే, 'నేను వున్నాను గదా .. టెన్షన్ పడకండి' అన్నారాయన. అంత పెద్ద స్టార్ అలా అండగా మాట్లాడిన విషయాన్ని నేను కొంతమందితో షేర్ చేసుకున్నాను. దాంతో 'ఆచార్య'లో మహేశ్ చేస్తున్నాడనే టాక్ బయటికి వెళ్లి, అది పెద్ద ప్రచారంగా మారింది' అని చెప్పుకొచ్చారు.
Chiranjeevi
Charan
Mahesh Babu
Koratala Siva

More Telugu News