Hyderabad: హైదరాబాద్, సనత్ నగర్ లో కలకలం రేపిన చైనా అమ్మాయిలు!

Two china Girls Caught and sent to Quarentine Center for Corona Test
  • ఎర్రగడ్డ సమీపంలో పోలీసు చెక్ పోస్ట్
  • కారులో ఇద్దరు చైనా యువతుల గుర్తింపు
  • అదుపులోకి తీసుకుని క్వారంటైన్ సెంటర్ కు తరలింపు
హైదరాబాద్ లోని సనత్ నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు చైనా యువతులు, ఓ నాగాలాండ్ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు, ఎర్రగడ్డ సమీపంలో సనత్ నగర్ కు వెళ్లే మార్గంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆ దారిలో వచ్చిన ఓ కారులో ముగ్గురు అమ్మాయిలు ఉండటాన్ని చూసిన పోలీసులకు, వారు భారతీయులు కాదన్న అనుమానం వచ్చింది. వివరాలను అడిగి తెలుసుకున్న వారు, వెంటనే ముందు జాగ్రత్త చర్యగా వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారికి కరోనా పరీక్షలు చేయిస్తామని, వ్యాధి లేదని తేలితే, హోమ్ క్వారంటైన్ నిమిత్తం పంపిస్తామని వెల్లడించారు.
Hyderabad
China Lady
Quarantine Centre
Police
Sanatnagar

More Telugu News