Varun Tej: తాత ఒళ్లో కూర్చున్న వరుణ్ తేజ్.. ఫొటో ఇదిగో!

VarunTej shares an adorable throwback picture with his grandfather
  • చిన్ననాటి ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్
  • మనవడ్ని ముద్దు చేస్తున్న కొణిదెల వెంకట్రావు
  • విమానంలో ప్రయాణిస్తుండగా తీసిన ఫొటో
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమల్లో ఉండడంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దాంతో కొందరు వంటలు చేస్తూ, వర్కౌట్లు చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. మరికొందరు తమ చిన్ననాటి ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా, యువ మెగా హీరో వరుణ్ తేజ్ బాల్యంలో తన తాతగారి ఒళ్లో కూర్చుని ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. వరుణ్ తేజ్, ఆయన తాతగారు కొణిదెల వెంకట్రావు ఓ విమానంలో ప్రయాణిస్తుండగా ఆ ఫొటోను క్లిక్ మనిపించినట్టు అర్థమవుతోంది. తన ఒళ్లో కూర్చున్న మనవడు వరుణ్ తేజ్ ను కొణిదెల వెంకట్రావు ముద్దు చేయడం ఆ ఫొటోలో చూడొచ్చు.
Varun Tej
Grand Father
Konidela Venkatrao
Lockdown

More Telugu News