Manirathnam: వెబ్ సిరీస్ లపై ఆసక్తి లేదు: మణిరత్నం

Manirathnam
  • దర్శకుడిగా మణిరత్నం స్థానం ప్రత్యేకం
  • షూటింగు దశలో 'పొన్నియిన్ సెల్వన్'
  • గతంలో ఫీచర్ ఫిలిమ్స్ చేశానన్న మణిరత్నం
కథకు కొత్తదనాన్ని .. పాత్రలకు నిండుదనాన్ని తీసుకొచ్చే దర్శకులలో మణిరత్నం ముందువరుసలో కనిపిస్తారు. ఆయన సినిమాల్లోని ప్రతి ఫ్రేమ్ ఒక అందమైన పోస్టర్ లా కనిపిస్తుంది. కథను .. పాత్రలను సహజత్వానికి దగ్గరగా నడిపించే ఆయన తాజాగా 'పొన్నియిన్ సెల్వన్' అనే చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దాంతో ఇంటిపట్టునే వున్న ఆయన, సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చారు. 'భవిష్యత్తులో వెబ్ సిరీస్ లను రూపొందించే ఆలోచన ఏమైనా ఉందా?' అని ఒక నెటిజన్ ఆయనను ప్రశ్నించాడు. అందుకాయన స్పందిస్తూ .. 'నేను చేసిన ఫీచర్ ఫిలిమ్స్ బుల్లితెరపై అంతగా సక్సెస్ కాలేదు. అందువలన వెబ్ సిరీస్ లు చేయాలనే ఆలోచనగానీ .. ఆసక్తిగాని నాకు లేవు" అంటూ ఆయన సమాధానమిచ్చారు.
Manirathnam
Suhasini
KollyWood

More Telugu News