movie: ‘21 డేస్’ పేరుతో లాక్‌డౌన్‌పై సినిమా

Kollywood filmmaker announces movie on the lockdown
  • ప్రకటించిన కోలీవుడ్ దర్శక, నిర్మాత విజయ్ భాస్కర్
  • లాక్‌డౌన్‌ ముగియగానే షూటింగ్‌కు ప్లాన్‌
  • తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తామని వెల్లడి
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాలా దేశాలు నిరంతరం పోరాడుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ తమ దేశాల్లో  అనేక ఆంక్షలు విధించారు. భారత్ లో ఇప్పటికే 21 రోజుల లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం.. దాన్ని  మే 3 వరకూ పొడిగించింది.  ఈ లాక్‌డౌన్ ఇతివృత్తంగా  సినిమా తీయాలని కోలీవుడ్  నిర్మాత ఎం. విజయ భాస్కర్  రాజ్ నిర్ణయించారు. ‘21 డేస్‌’ పేరుతో  స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటించారు.  దర్శకుడిగా ఆయనకిదే తొలి చిత్రం. కథ, కథనం, మాటలు కూడా ఆయనే అందిస్తున్నారు.

వైరస్‌పై ప్రజల్లో చైతన్యం కలిగించేలా చిత్రాన్ని రూపొందిస్తామని విజయ్ చెప్పారు. వైరస్ ప్రమాదాన్ని తెలిపే సూక్ష్మ సినిమా కాదని, స్నేహం, ప్రేమ తదితర అంశాలు కూడా ఉంటాయని తెలిపారు. మూడు గంటల్లోనే కథ తట్టిందని, వారం రోజుల్లో స్క్రిప్ట్ తయారు చేశానని విజయ్ భాస్కర్ తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నానని చెప్పారు. అంతా సవ్యంగా సాగితే  తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.
movie
on
Lockdown
21 days
kollywood

More Telugu News