Kajal Aggarwal: టాలీవుడ్ సినీ కార్మికుల కోసం రూ.2 లక్షల విరాళం ప్రకటించిన కాజల్

Actress  Kajal Aggarwal Contributes two Lakhs towards Corona Crisis Charity
  • లాక్ డౌన్ తో ఉపాధి కరవైన సినీ కార్మికులు
  • సీసీసీకి విరాళం అందించాలని నిర్ణయించుకున్న కాజల్
  • ఇప్పటికే సీసీసీకి భారీగా విరాళాలు ప్రకటించిన అగ్రనటులు
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినీ కార్మికుల కోసం విరాళం ప్రకటించింది. కరోనా కట్టడి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఉపాధి కోల్పోయిన టాలీవుడ్ సినీ వర్కర్లకు ఆమె రూ.2 లక్షలు అందించాలని నిర్ణయించుకున్నారు. కాజల్ తన విరాళాన్ని ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రారంభమైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి అందించనున్నారు.

 లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలు స్థంభించిపోయాయి. చిత్ర ప్రదర్శనలు నిలిచిపోవడమే కాదు, షూటింగులు కూడా ఆగిపోయాయి. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పనిలేక అవస్థలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు అగ్రనటులు భారీ విరాళాలు ప్రకటించారు.
Kajal Aggarwal
Tollywood
Workers
Donation
Lockdown
Corona Virus

More Telugu News