టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ తులసీరామ్ మృతి
- సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభం
- మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన నేత
- రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో విషాదం
ఆ తర్వాత రాజేంద్రనగర్ సమితి ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ప్రజా సమితి తరపున పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1969లో ఎంపీగా ఎన్నికై ఢిల్లీ సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు దగ్గరయ్యారు. పార్టీలో చేరి ఆయనకు రాజకీయ సలహాలు ఇస్తుండేవారు. 1985లో నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి మూడోసారి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా కూడా కొన్నాళ్లు పనిచేశారు.