Uttar Pradesh: తనను చూసి దగ్గుతున్నాడన్న కోపంతో.. స్నేహితుడిపై కాల్పులు!

Man shot his friend for as he caughing
షార్ట్స్‌లో చూడండి
కావాలనే దగ్గుతున్నాడని ఓ వ్యక్తిని అతడి స్నేహితుడే కాల్చి చంపేశాడు. గ్రేటర్ నోయిడాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. దయానగర్‌కు చెందిన ప్రశాంత్‌సింగ్ అలియాస్ ప్రవేశ్ (25), జై వీర్‌సింగ్ అలియాస్ గుల్లూ (30) వ్యవసాయం చేస్తుంటారు. నిన్న రాత్రి ప్రశాంత్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి దయానగర్ ఆలయంలో లూడో ఆడుతున్నాడు.

అదే సమయంలో అక్కడికి గుల్లూ వచ్చాడు. అతడిని చూసిన ప్రవేశ్ పదేపదే దగ్గడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను చూసి కావాలనే దగ్గుతున్నాడని గుల్లూ గొడవ పెట్టుకున్నాడు. అది మరింత ముదరడంతో సహనం కోల్పోయిన గుల్లూ జేబులోంచి తుపాకి తీసి ప్రవేశ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రవేశ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Uttar Pradesh
Greater Noida
Gun shooting

More Telugu News