NamrataShirodkar: ముఖానికి కర్చిఫ్‌ కట్టుకుని కొడుకు, కూతురితో మహేశ్‌ బాబు.. ఫొటోలు వైరల్

NamrataShirodkar via Instagram
  • ఫొటోలు పోస్ట్ చేసిన నమ్రత
  • కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించిన మహేశ్ భార్య
  • మాస్కులు ధరించాలంటే సూపర్‌స్టారే కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
  • మనల్ని మనం కాపాడుకోవాలంటూ పోస్ట్
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోన్న నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సాయపడడానికి సినీనటులు ముందుంటున్నారు. తాజాగా, టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు భార్య, సినీ నటి నమ్రత రెండు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి కరోనాపై జాగ్రత్తలు చెప్పింది.

ఈ రెండు ఫొటోల్లో మొదటి దాంట్లో మహేశ్‌ బాబు తన కుమారుడు గౌతమ్‌తో కనపడుతున్నాడు. గతంలో ఓ షూటింగ్‌ సందర్భంగా తీసిన ఫొటోగా ఇది కనపడుతోంది. ఇందులో ముఖానికి కర్చిఫ్ కట్టుకున్న మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్‌కు కూడా మాస్కులు పెడుతున్నట్లు ఉంది.
                                                            
రెండో ఫొటోలో మహేశ్ బాబు తన కూతురు సితారతో ఉన్నాడు. ఇందులోనూ మహేశ్ కర్చిఫ్‌తో కనపడ్డాడు. ఆయన పక్కనే ఉన్న సితార ముఖానికి మాస్కులు ధరించి కనపడుతోంది.

ఈ రెండు ఫొటోలను పోస్ట్ చేసిన నమ్రత... మాస్కు ధరించడానికి సూపర్‌స్టారే కావాల్సిన అవసరం లేదని, మాస్కులు ధరించి మనల్ని మనం రక్షించుకవోడంతో పాటు మనకు ఇష్టమైన వారిని కూడా కాపాడుకోవాలని సందేశమిచ్చింది.

కాగా, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే మహేశ్ బాబు, సితార వీడియోలు విడుదల చేసి సందేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వారు చెప్పిన ఆరు గోల్డెన్ రూల్స్‌పై ప్రశంసల జల్లు కురిసింది.
NamrataShirodkar
Mahesh Babu
Tollywood
Corona Virus

More Telugu News