ప్రభాస్ సినిమా కోసం 25 కోట్లు అడిగిన దీపిక?

Nag Ashwin Movie
  • దేశ వ్యాప్తంగా దీపిక పదుకొనెకి క్రేజ్
  • భారీ పారితోషికం తీసుకునే కథానాయికల జాబితాలో ఆమె పేరు
  • ఆలోచనలోపడిన వైజయంతీ మూవీస్
బాలీవుడ్ కథానాయికలలో దీపిక పదుకొనె స్థానం ప్రత్యేకం. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆమె స్థానాన్ని ఒక్కో మెట్టూ పెంచుకుంటూ వెళ్లింది. అందం .. అభినయం కలగలిసిన దీపికకి దేశ వ్యాప్తంగా వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందువల్లనే అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల జాబితాలో ఆమె పేరు చేరిపోయింది.

'పద్మావత్' సినిమా నుంచి ఆమె 15 కోట్లకి పైనే పారితోషికాన్ని తీసుకుంటోందని తెలుస్తోంది. అలాంటి దీపికను ప్రభాస్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం చేయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రయత్నిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ కారణంగానే ప్రభాస్ జోడీగా దీపికను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరిపారట. అయితే ఆమె 25 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. దాంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Prabhas
Deepika Padukone
Nag ashwin

More Telugu News