Balakrishna: బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ చేయించిన బి.గోపాల్

B Gopal Movie
  • బోయపాటితో బాలకృష్ణ మూవీ
  • తదుపరి సినిమా బి. గోపాల్ తో
  • స్క్రిప్ట్ సిద్ధం చేసిన సాయిమాధవ్ బుర్రా
బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన హిట్స్ ఇచ్చిన దర్శకుల జాబితాలో 'బి.గోపాల్ ఒకరుగా కనిపిస్తారు. బలమైన కథాకథనాలను సిద్ధం చేసుకోవడం, బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు కోరుకునే అంశాలను పుష్కలంగా అందించడం బి.గోపాల్ ప్రత్యేకత. అందువల్లనే బాలకృష్ణ ఆయనకి మరో అవకాశం ఇచ్చారు.

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ బాధ్యతలను సాయిమాధవ్ బుర్రాకు బి. గోపాల్ అప్పగించారు. కొంతకాలంగా ఆ స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూ వచ్చిన సాయిమాధవ్, ఆ పనిని పూర్తి చేశాడట. ఇక ఫైనల్ గా బాలకృష్ణకి వినిపించడమే తరువాయి. ప్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తయిన తరువాత బి.గోపాల్ తో కలిసి సెట్స్ పైకి వెళతారు. ఈ లోగా బి.గోపాల్ మిగతా పనులను చక్కబెడతారన్న మాట.
Balakrishna
B.Gopal
Boyapati Sreenu

More Telugu News