Mahesh Babu: నయా బిజినెస్ లోకి టాలీవుడ్ హీరో మహేశ్ బాబు!

Mahesh Babu New Business
  • ఓటీటీ వ్యాపారంపై కన్నేసిన మహేశ్
  • ముంబైకి చెందిన నిర్మాణ సంస్థతో చర్చలు
  • ఇంకా అధికారికంగా వెలువడని ప్రకటన
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు, ఇప్పటికే సినిమా థియేటర్స్, టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యాపారంలోకి కూడా దిగబోతున్నారని సమాచారం. ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో ఈ మేరకు చర్చలు ప్రారంభమయ్యాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవలి కాలంలో ఓటీటీ (ఓవర్ ది టాప్) మీడియా సర్వీసెస్ వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సైతం 'ఆహా' అనే పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. ఇక ఇప్పుడు మహేశ్ సైతం అదే రంగంలోకి దిగాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
Mahesh Babu
OTT
New Business

More Telugu News