Telangana: తెలంగాణలో నిన్న ఒక్క రోజే 61 కేసుల నమోదు.. భయపెడుతున్న మహమ్మారి

Corona death toll raised 17 in Telangana
  • రాష్ట్రంలో 592కు పెరిగిన కేసుల సంఖ్య
  • నిన్న ఒకరి మృతి..
  • ఐదు జిల్లాల్లో మినహా 28 జిల్లాల్లో వైరస్ 
తెలంగాణలో కరోనా వైరస్ భయపెడుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 61 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇది రెండోసారి. గత వారం ఒక్క రోజే 75 కేసులు వెలుగుచూశాయి.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 592కు పెరిగింది. వీటిలో హైదరాబాద్‌లో నమోదైన కేసులే 267 ఉండడం గమనార్హం. అలాగే, రాష్ట్రంలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. 103 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఐదు జిల్లాల్లో మినహా 28 జిల్లాల్లో వైరస్ విస్తరించింది. మరోవైపు వైరస్ తీవ్రంగా ఉన్న 246 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. 6,41,194 ఇళ్లలో ఇంటింటి సర్వే చేపట్టి 27,32,644 మందిని పరీక్షించింది.
Telangana
Corona Virus
Hyderabad

More Telugu News