కరోనాపై పోరుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రూ. 5 కోట్ల విరాళం
- స్వచ్ఛంద సంస్థ గివ్ ఇండియాకు విరాళం అందించిన సుందర్ పిచాయ్
- కరోనాపై పోరుకు గత నెలలో 800 మిలియన్ డాలర్లు ప్రకటించిన గూగుల్
- నెరోలాక్ రూ. 4 కోట్ల విరాళం
మరోవైపు, డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం 4 లక్షల మాస్కులు, పరిశుభ్రతకు ఉపయోగించే 10 లక్షల ఉత్పత్తులను సైన్యం, సీఆర్‌పీఎఫ్, ఆరోగ్య సేవల సిబ్బందికి అందించింది. కెన్సాన్ నెరోలాక్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 4 కోట్ల విరాళం ప్రకటించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పీఎం కేర్స్ ఫండ్‌కు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ రూ. 26 కోట్లు అందించింది.