నిజం చెప్పాలంటే నాకు నటనపై ఆసక్తి ఉండేది కాదు: నటుడు రావు రమేశ్
- దర్శకుడిని కావాలని ఉండేది
- చాలా కష్టమంటూ అమ్మ వారించింది
- అమ్మ మాట విన్నానన్న రావు రమేశ్
"మొదటి నుంచి కూడా నాకు దర్శకుడిని కావాలనే ఉండేది. నటుడిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు .. దానిపై పెద్దగా ఆసక్తి కూడా ఉండేది కాదు. నేను దర్శకుడిని అవుతానని మా అమ్మతో చెప్పాను. 'అదంత తేలికైన పని కాదురా .. చాలా కష్టం. చాలా విషయాలపైన చాలా అవగాహన ఉండాలి. దానికంటే నటనే తేలిక .. నువ్వు నటనవైపే వెళ్లు. ఎందుకనో నువ్వు నటనలోనే రాణిస్తావని అనిపిస్తోంది' అని అంది. అమ్మమాట కదా .. విన్నాను. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో వున్నాను" అని చెప్పుకొచ్చారు.