BS Yedurappa: రాబోయే 15 రోజుల లాక్ డౌన్ పై రెండ్రోజుల్లో మార్గదర్శకాలు వస్తాయి: కర్ణాటక సీఎం

Yedurappa says Govt of India will announce guidelines for further lock down
  • సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కర్ణాటక సీఎం
  • తదుపరి లాక్ డౌన్ పై కేంద్రం తమకు సూచనలు చేసిందన్న యడియూరప్ప 
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, లాక్ డౌన్ పొడిగిస్తున్నారంటూ సూచన ప్రాయంగా తెలియజేశారు. లాక్ డౌన్ పై ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడవద్దని ప్రధాని స్పష్టం చేశారని వెల్లడించారు. వచ్చే 15 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నందున తమకు కేంద్రం అనేక సలహాలు, సూచనలు ఇచ్చిందని వివరించారు. తదుపరి లాక్ డౌన్ పై ఒకట్రెండు రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయని ప్రధాని తమతో చెప్పారని యడియూరప్ప పేర్కొన్నారు.
BS Yedurappa
Lockdown
Guidelines
Centre
Narendra Modi
Video Conference

More Telugu News