Saitej: సాయితేజ్ కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Deva Katta Movie
  • దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్
  • కథానాయికగా నివేదా పేతురాజ్
  •  రెగ్యులర్ షూటింగు వాయిదా
'ప్రతిరోజూ పండగే' సినిమాతో హిట్ కొట్టిన సాయితేజ్, తన తదుపరి సినిమాను దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు. భగవాన్ - పుల్లారావు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. క్రితం నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగవలసి వుంది.

అయితే లాక్ డౌన్ కారణంగా ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడం లేదనీ, పరిస్థితులు చక్కబడిన తరువాత రెగ్యులర్ షూటింగు తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు. ఇక తమ సినిమా గురించి కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయనీ, అలాగే ఫలానా పాత్రలను ఫలానా వాళ్లు నటిస్తున్నారంటూ లేనిపోని ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ సినిమాకి సంబంధించిన విషయాలను తాము అధికారికంగా తెలియజేస్తామని చెప్పారు. ఈ సినిమాలో సాయితేజ్ సరసన నాయికగా నివేదా పేతురాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Saitej
Niveda Pethuraj
Deva Katta

More Telugu News