'కేజీఎఫ్' డైరెక్టర్ తో ప్రభాస్?
- 'కేజీఎఫ్'తో మంచి క్రేజ్
- ప్రభాస్ పైనే దృష్టి
- రంగంలోకి మైత్రీ మూవీ మేకర్స్
'కేజీఎఫ్'తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తోగానీ .. మహేశ్ తోగాని సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఆ ఇద్దరి నెక్స్ట్ మూవీ వేరే దర్శకులతో సెట్ అయింది. దాంతో ప్రశాంత్ నీల్ .. 'కేజీఎఫ్ 2' తరువాత సినిమాను ప్రభాస్ తో చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు.
ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారి అడ్వాన్స్ ప్రశాంత్ నీల్ దగ్గర ఉందట. తమ బ్యానర్లో వాళ్లు ప్రభాస్ సినిమాను సెట్ చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.