Viral Videos: నిర్మానుష్యంగా మారిన ఢిల్లీ వీధులు.. డ్రోన్‌ దృశ్యాలు ఇవిగో!

WATCH Delhi Drones Visuals
  • కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఢిల్లీలో పోలీసుల కఠిన చర్యలు  
  • అనవసరంగా బయటకు వస్తే చట్ట ప్రకారం కేసులు
  • ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో పెరిగిన నిఘా
  • ఢిల్లీలో ఇప్పటివరకు 720 మందికి కరోనా పాజిటివ్‌  
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఢిల్లీలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలోనూ అనవసరంగా బయటకు వస్తే చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు.

ఇందుకోసం డ్రోన్లను కూడా వినియోగించుకుంటున్నారు. షాహ్‌దరా జిల్లాలో డ్రోన్లతో ఢిల్లీలో తీసిన దృశ్యాలను పోలీసులు మీడియాకు అందించారు. ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో నిఘాను పెంచేశారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ప్రస్తుతం బోసిబోయి కనపడుతున్నాయి. వాహనాలపై అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని, మాస్కులు ధరించకుండా బయటకు వస్తోన్న వారిని పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.

ఢిల్లీలో ఇప్పటివరకు 720 మందికి కరోనా పాజిటివ్‌
కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 720 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్ ప్రకటించారు. వారిలో 22 మంది ఐసీయూలో, ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 6412కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 5709 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుండగా, 503 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడచిన 12 గంటల్లో దేశంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
Viral Videos
New Delhi
Corona Virus

More Telugu News