మాస్క్‌లు, పీపీఏ కిట్స్‌ ఇవ్వకుంటే పనిచేయలేం: అనంతపురంలో జూడాల పట్టు

  • ఐసోలేషన్‌ వార్డులో సేవలందించే వారికే ఇస్తామన్న అధికారులు
  • విధులు బహిష్కరించి నిరసన తెలిపిన జూనియర్‌ డాక్టర్లు
  • ఈ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బందికి వైరస్‌
మాస్క్‌లు, పీపీఏ కిట్స్‌ అందజేయకుంటే తాము విధులు నిర్వహించలేమని అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ డాక్టర్లు స్పష్టం చేశారు. కరోనా ఐసోలేషన్‌ వార్డులో సేవలందిస్తున్న సిబ్బందికి తప్ప మిగిలిన వారికి ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేయడంతో వారంతా విధులు బహిష్కరించి తమ నిరసన తెలియజేశారు. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తున్న ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బందికి కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో జూడాలు ఆందోళన చెందుతూ తమకు రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Anantapur District
government hospital
junior doctors
strike

More Telugu News