Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Rakul Preeth Singh donates her earnings through youtube to PM CARES FUND
షార్ట్స్‌లో చూడండి
 *  ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన యూ ట్యూబ్ చానెల్ లో మళ్లీ వీడియోలు పోస్ట్ చేయనుంది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం కరోనా సహాయక చర్యల నిమిత్తం పీఎం కేర్స్ ఫండ్ కి పంపిస్తుందట.
*  రానా దగ్గుబాటిని గతంలో 'లీడర్' చిత్రం ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల వెండితెరకు పరిచయం చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రానుంది. ప్రస్తుతం తాను చేస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రం తర్వాత శేఖర్ తన తదుపరి చిత్రాన్ని రానాతో చేస్తాడని సమాచారం.
*  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' చిత్రం రూపొందుతోంది. అయితే, గతంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి ఇది సీక్వెల్ మాత్రం కాదని దర్శకుడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు. 'ఆ చిత్రానికీ, ఈ చిత్రానికి అసలు సంబంధం లేదు. కేవలం టైటిల్ మాత్రమే తీసుకున్నాం. దేశంలోని వివిధ స్వయంభూ దేవాలయాల శిల్పకళకు సంబంధించిన కథతో ఇది సాగుతుంది' అని చెప్పాడు దర్శకుడు.
Go Back to Shorts
Rakul Preet Singh
Rana
Shekhar Kammula
Nikhil

More Telugu News