లాక్డౌన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. హోంగార్డు మృతి
- గుంటూరు జిల్లాలో ఘటన
- విధులకు బైక్పై బయలుదేరిన హోంగార్డులు
- శునకం అడ్డం రావడంతో డివైడర్ను ఢీకొట్టిన బైక్
మరికాసేపట్లో పొందుగుల చేరుకుంటారనగా రహదారిపై శునకం అడ్డం రావడంతో, దానిని తప్పించేందుకు ప్రయత్నించే క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. శ్రీనివాసరావు, నారాయణస్వామి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరినీ పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన హోంగార్డు నారాయణస్వామిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు.