'రామాయణ్' ఘట్టాన్ని ఉటంకిస్తూ.. భారత్ ను క్లోరోక్విన్ పంపించాలని వేడుకున్న బ్రెజిల్!
- హైడ్రాక్సి క్లోరోక్విన్ ను పంపించాలని ఇండియాను కోరిన బ్రెజిల్
- లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు సంజీవని తెచ్చాడన్న బ్రెజిల్ అధ్యక్షుడు
- మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేతులు కలుపుతామన్న మోదీ
తాజాగా క్లోరోక్విన్ ను పరఫరా చేయించాలని బ్రెజిల్ కూడా ఇండియాను కోరింది. హైడ్రాక్సి క్లోరోక్విన్ ను ఇవ్వాలని మోదీని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో కోరారు. ఈ సందర్భంగా హిందువులు పవిత్రంగా భావించే రామాయణాన్ని ఆయన ఉటంకించారు. 'శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడిని కాపాడేందుకు హిమాలయాల నుంచి హనుమంతుడు సంజీవనిని తెచ్చినట్టు... అనారోగ్యంతో ఉన్నవారికి జీసస్ స్వస్థత చేకూర్చినట్టు... ప్రజల కోసం ఇండియా, బ్రెజిల్ కలసి కట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి' అని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు లేఖ రాశారు. అంతేకాక మోదీతో ఫోన్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... బ్రెజిల్ అధ్యక్షుడితో ఫలప్రదమైన చర్చ జరిగిందని... మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేతులు కలుపుతామని చెప్పారు.