Punjab: అనుబంధాలను చెరిపేస్తున్న కరోనా.. కన్నతల్లి అంత్యక్రియలకు నిరాకరించిన కొడుకు!

Son Refuses To Cremate Mother amid fears of Corona
  • పంజాబ్ లో కరోనాతో మరణించిన 69 ఏళ్ల వృద్ధురాలు
  • డెడ్ బాడీని తీసుకెళ్లడానికి నిరాకరించిన కుమారుడు
  • అంత్యక్రియలను నిర్వహించిన అధికారులు
మన దేశంలో ఎంతో బలమైన కుటుంబ అనుబంధాలను కూడా కరోనా భయాలు చెరిపేస్తున్నాయి. నవ మాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లి డెడ్ బాడీని తీసుకోవడానికి కూడా కుమారుడు నిరాకరించడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఈ అమానవీయ ఘటన పంజాబ్ లోని లూధియానాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, షిమ్లాపురి గ్రామానికి చెందిన 69 ఏళ్ల వృద్ధురాలిని కరోనా లక్షణాలతో మార్చి 31న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. గత ఆదివారం ఆమె కరోనా రక్కసి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె డెడ్ బాడీని తీసుకెళ్లాలని జిల్లా అధికారులు ఆమె కుమారుడిని కోరారు. అయితే ఆమె శవాన్ని తీసుకెళ్లేందుకు కుమారుడు కానీ, బంధువులు కానీ రాలేదు. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు.

ఈ నేపథ్యంలో, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ మాట్లాడుతూ, డెడ్ బాడీ నుంచి ఇన్ఫెక్షన్ సోకకుండా అవసరమైన రక్షణ కవచాన్ని కూడా ఇస్తామని చెప్పామని... అయినా ఆమె కుమారుడు కానీ, బంధువులు కానీ రాలేదని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులను అధికారులు రెండు సార్లు సంప్రదించారని... అయినా వారు ముందుకు రాలేదని తెలిపారు. ఇది తమను షాక్ కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు చేసేదేమీ లేక... నిన్న అర్ధరాత్రి జిల్లా అధికారులే అంత్యక్రియలను నిర్వహించారని చెప్పారు. మృతురాలి కుమారుడు, బంధువులు అంత్యక్రియలను 100 మీటర్ల దూరం నుంచి వీక్షించారని తెలిపారు.
Punjab
Ludhiana
Corona Virus
Old Woman
Dead Body
Funerals

More Telugu News