Kanna Lakshminarayana: వైసీపీ నేతలకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి: కన్నా లక్ష్మీనారాయణ

ఏపీలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. ఆ పార్టీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గుంటూరులో ఈరోజు జరిగిన పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో కేంద్రం చేస్తున్న సాయాన్ని జగన్‌ ప్రభుత్వం తమదిగా చెప్పుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆక్షేపించారు. అలాగే, కరోనా విషయంలోనూ వాస్తవాలు దాచిపెడుతున్నారని, ప్రభుత్వం వెలువరిస్తున్న నివేదికల్లో వాస్తవం లేదని ధ్వజమెత్తారు. ఈ కష్ట సమయంలో పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పోరాడాలని, ప్రధాని మోదీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.
Kanna Lakshminarayana
Guntur District
BJP formation day

More Telugu News