Corona Virus: విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఏప్రిల్ 14 తర్వాతే నిర్ణయం: కేంద్రం

Centre says educational institutions reopening may depend on review
  • ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్ డౌన్
  • సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రమంత్రి పొక్రియాల్
  • విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్య అంశమని వెల్లడి
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ మరికొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగియనుందని, విద్యా సంస్థల పునఃప్రారంభంపై లాక్ డౌన్ ముగిసిన తర్వాత సమీక్ష జరిపి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సి వచ్చినా, విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని పొక్రియాల్ వెల్లడించారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పెండింగ్ లో ఉన్న పరీక్షల నిర్వహణ, ఇప్పటికే పూర్తయిన పరీక్షల మూల్యాంకనం చేపట్టడంపై ఓ ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు.
Corona Virus
Lockdown
Schools
Colleges
Re-Opening

More Telugu News