Balakrishna: కరోనా సహాయచర్యల కోసం రూ.50 లక్షల చెక్ ను కేటీఆర్ కు అందించిన బాలకృష్ణ

Balakrishna donates huge amount to Telangana CM Relief Fund
  • మొత్తం రూ.1.25 లక్షల విరాళం ప్రకటించిన బాలకృష్ణ
  • తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షల చొప్పున విరాళం
  • సినీ కార్మికుల కోసం రూ.25 లక్షలు
కరోనా వ్యాప్తి నివారణ, సహాయచర్యల కోసం నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.1.25 కోట్ల భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రూ.50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో రూ.50 లక్షలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు. తాజాగా, తెలంగాణకు సంబంధించి తన విరాళం తాలూకు చెక్ ను మంత్రి కేటీఆర్ కు అందజేశారు. విరాళం అందించినందుకు బాలయ్యకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బాలయ్య మరో రూ.25 లక్షలు సినీ కార్మికుల సంక్షేమానికి అందించారు.
Balakrishna
Corona Virus
Andhra Pradesh
Telangana
Tollywood
Donation

More Telugu News