Nara Lokesh: నిధులు లేవంటూ అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది: నారా లోకేశ్

lokesh fires on ycp leaders
  • వైకాపా నాయకులు బాగుంటే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు
  • కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రమే
  • వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం 
  • జగన్ గారి బాటలోనే వైకాపా నాయకులు నడుస్తున్నారు 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు సమర్థవంతంగా లేవని టీడీపీ నేత నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. 'ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల  చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు' అని ట్వీట్ చేశారు.
 
'వైకాపా నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రం. కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది' అని పేర్కొన్నారు.

'జగన్ గారి బాటలోనే వైకాపా నాయకులు నడుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారు. డాక్టర్లకి ఇచ్చిన మాస్కులను వీఐపీలమంటూ వైకాపా నాయకులు కొట్టేయ్యడం దారుణం' అని విమర్శించారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News