డాక్టర్ చీటీ ఉంటే మద్యం సరఫరా చేయచ్చన్న నిర్ణయాన్ని తప్పుబట్టిన కేరళ హైకోర్టు!
- లాక్ డౌన్ కారణంగా మద్యం బంద్
- కేరళలో ఎనిమిది మంది ఆత్మహత్య
- డాక్టర్ అనుమతి ఉంటే మద్యం సరఫరాకు సీఎం నిర్ణయం
- హైకోర్టును ఆశ్రయించిన ఉద్యమకారులు, ఐఎంఏ
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు వారాల పాటు ఎలాంటి అమ్మకాలు జరపరాదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, రాష్ట్రంలో మద్యం దొరక్క 8 మంది చనిపోయారంటూ ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. అయితే, డాక్టర్ అనుమతితో మద్యం అమ్మకాల నిర్ణయం కలవరపాటుకు గురిచేసేలా ఉందని, అది వినాశ హేతువు అని పేర్కొంది. పైగా ఇలాంటి నిర్ణయాలను ఏ శాస్త్రీయ అధ్యయనం కూడా సమర్థించబోదని హైకోర్టు అభిప్రాయపడింది.